మొన్న కన్నుకొట్టి.. నేడు చీర కట్టి…

238
Priya Prakash Varrier wishes Happy Vishu looks saree
- Advertisement -

ఈ మధ్య ఒక్క కనుసైగతో కుర్రకారులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. అదేనండి ప్రియాప్రకాష్ వారియర్ మలయాళ ముద్దుగుమ్మ, ఒక్కసారి కన్నుగొట్టి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఆ ముద్దుగుమ్మ చీరకట్టుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోతో అభిమానులు ఫిదా అయిపోతున్నారట. ఈ మధ్య కాలంలో తన అభిమానులకు ప్రియావారియర్ దగ్గర ఉండేండుకు పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

అయితే మలయాళ న్యూ ఇయర్ ‘విషూ‘ సందర్భంగా చీరకట్టులో మెరిసిపోతుంది ఈ ముద్దుగుమ్మ. అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ ఓ దీపాన్ని పట్టుకుని కనిపించి కనువిందు చేస్తుంది. క్రీమ్ కలర్‎లో ఆకుపచ్చని వర్క్, ఎరుపు రంగు బార్డర్‎తో సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియ కనిపిస్తుండగా, దీనిపై నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. నుదుటన పెట్టుకున్న ఎర్రని బొట్టుతో ఆమె అందాన్ని మరింతగా పెంచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోను మీరు చూడండి మరీ.

- Advertisement -