ప్రియా నాయుడుకి లక్కీ ఛాన్స్

365
Priya Naidu
- Advertisement -

తెలుగమ్మాయి ప్రియా నాయుడుకి లక్కీ ఛాన్స్ దొరికింది. బాహుబలి2లో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించబోతుంది ఈ భామ. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రంలో ప్రియా నటిస్తోంది. ఇది ప్రియా మొదటి సినిమా.

 Priya Naidu

అంతేకాదు శ్రీనువాస అవసరాలతో హంటర్ రిమేక్‌లోనూ ప్రియా ఛాన్స్కొట్టేసింది. ఆపై అడవిశేషు గూఢచారి ఫిల్మ్‌లోనూ నటించనుంది. ఇవన్నీపక్కనపెడితే.. బాహుబలి లాంటి చిత్రంలో అవకాశం రావడంతో ఎగిరి గంతేస్తోంది ప్రియా. హైదరాబాద్ లో పుట్టిన ఈ భామ మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది. రీసెంట్ గా బాహుబలి టీం ఒక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించింది.

అయితే విషయం తెలుసుకున్న ప్రియా కజిన్ ఒకరు ఆమె ఫోటోలు బాహుబలి చిత్ర యూనిట్ కుపంపడంతో.. ఆడిషన్ కు రావాలంటూ వెంటనే పిలుపు వచ్చిందట. చివరకు ఈ మూవీలోసపోర్టింగ్ క్యారెక్టర్ రోల్‌లో ఆఫర్ లభించిందని, తన సంతోషం చెప్పలేకపోతున్నానని అంటోంది ఈ బ్యూటీ.

- Advertisement -