గుత్తా జ్వాల ప్రియుడితో నటి ప్రియా రొమాన్స్..!

679
priya
- Advertisement -

భారత బ్యాడ్మింటన్‌ మాజీ స్టార్‌ గుత్తా జ్వాల న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్ 31న విషెస్‌ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తన కొత్త చిత్రాలతో విష్ణు విశాల్ బిజీ అవుతున్నాడు.

jwala

ప్రస్తుతం ‘జగజ్జాల కిలాడీ’, ‘ఎఫ్ఐఆర్’ చిత్రాల్లో నటిస్తున్న ఆయన, తాజాగా మరో కొత్త సినిమాలో ప్రియా భవానీ శంకర్ తో రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కథను విన్న ప్రియా భవానీ, నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నో చిత్రాలను చేతిలో ఉంచుకున్న ఈ అమ్మడు, ఇంకా డేట్స్ మాత్రం కేటాయించలేదని సమాచారం.అయితే ఈ చిత్ర కథ నచ్చిందని, ఖాళీ చూసుకుని డేట్స్ ఇస్తానని అంటోందట ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -