- Advertisement -
యాదాద్రిలో నేటి నుండి కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. భక్తులెవరైనా ఆర్టీసీ బస్సులోనే కొండపైకి ప్రయాణం చేయాల్సి ఉండగా ప్రయాణం ఉచితం. యాదాద్రిలో మహాసంప్రోక్షణ ముగియడంతో భక్తులు పెత్త ఎత్తున తరలివస్తున్నారు.
లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలు కొండ కిందే పార్క్ చేయాలని ఆలయ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. సొంత వాహనాల్లో కాకుండా యాదాద్రి కొండపైకి ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని వెల్లడించారు.
భక్తుల తరలింపునకు అయ్యే ఖర్చు మొత్తం దేవస్థానమే భరించనుంది. స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం ఇలా మరికొన్ని ప్రత్యేక సేవలను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
- Advertisement -