దారుణం..హోం వర్క్‌ చేయలేదని!

5
- Advertisement -

హర్యానా – చండీగఢ్‌లోని పానిపట్ పట్టణంలో శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి డ్రైవర్‌తో కొట్టించింది ప్రిన్సిపాల్.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా ప్రిన్సిపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తె..హర్యానా – చండీగఢ్‌లోని పానిపట్ పట్టణంలో శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడుని శారీరక వేధింపులకు గురిచేశారు స్కూల్ బస్సు డ్రైవర్. ఇందుకు కారణం హోంవర్క్ చేయకపోవడమే.

బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి, అతన్ని కొట్టారు డ్రైవర్. బాలుడిని కొట్టిన వీడియోను కొద్దిరోజులకు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు డ్రైవర్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అయితే తాను కేవలం మందలించమన్నానని కానీ కొట్టిన విషయం నాకు తెలియదని ప్రిన్సిపాల్ చెప్పడం విశేషం.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -