ప్రధాని మోదీ భావోద్వేగం..

144
pm modi
- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తితో వేల మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధాన మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్ సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలో ప్రధాని వారితో మాట్లాడుతూ.. ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంది. వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారు’’ అని మోదీ అన్నారు.

- Advertisement -