Modi:ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

27
- Advertisement -

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించారు. అనంతరం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం అన్నారు. దేశంకోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కలిశాను. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి అని కొనియాడారు మోడీ. పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని మండిపడ్డారు.

1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్ కు నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము . ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు.

Also Read:భారీ వర్షాలతో శ్రీశైలంకు పోటెత్తిన వరద

- Advertisement -