సందీప్ కిషన్ వదిలిన ‘ప్రెజర్ కుక్కర్’ సాంగ్‌..

353
- Advertisement -

కారంపూరి క్రియేషన్స్ అండ్ మైక్‌ మూవీస్ పతాకంపై సాయి రొనాక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై మరియు సుశీల్ ద‌ర్శ‌క నిర్మాత‌లుగా రూపొందిస్తున్న చిత్రం `ప్రెజ‌ర్ కుక్క‌ర్‌`. ఎ.అప్పిరెడ్డి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా.. సందీప్ కిషన్ మాట్లాడుతూ “సాంగ్ చాలాబాగుంది.. లిరిక్స్ సైతం డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌కు త్వరగా రీచ్ అయ్యేలా ఉందీ సాంగ్. టైటిల్‌లాగానే సినిమా స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉందని విన్నాను.. తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అని చెప్పారు.

Pressure Cooker Movie

దర్శక నిర్మాత సుజై మాట్లాడుతూ “యూత్‌కి మంచి మెసేజ్ ఉంది. కథకు తగ్గ సంగీతం కుదిరింది. ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ మంచి మ్యూజిక్‌ను అందించారు. మా సినిమా ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేసిన సందీప్‌కిష‌న్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ సిప్లిగుంజ్ మాట్లాడుతూ “ ఈ రోజు మా ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసిన హీరో సందీప్ అన్నకు థాంక్స్. ‘నువ్వు అయిపోతావురా లంగా ‘ అనే సాంగ్‌ను తెలంగాణ వాడుక భాషలో కంపోస్ చేయడం జరిగింది. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. అలాగే వ‌ర్క్‌ను ఎంజాయ్ కూడా చేశాం. త‌ప్ప‌కుండా సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చుతుంది“ అని అన్నారు.

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ “ప్రతి ఒక్కరికీ డిగ్రీ అవ‌గానే ఇక్క‌డ‌ జాబ్ చేయాలా? లేక ఫారిన్ వెళ్లాలా? అనే ఆలోచ‌న వ‌స్తుంది. అలాగే లైఫ్‌లో ప్రతి పనికీ ఓ ప్రెజర్ ఉంటుంది. అలా ఈ సినిమాలో హీరో ఆ ప్రెజర్‌ను ఎలా హ్యాండిల్ చేశార‌నేదే స్టోరీ. ప్రెజంట్ యూత్‌కి మంచి మెసేజ్‌లాంటి మూవీ. నటీ నటులందరూ అందరూ నేచుర‌ల్‌గా పెర్ఫామెన్స్ చేశారు. మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

Pressure Cooker

హీరోయిన్ ప్రీతి మాట్లాడుతూ “ఈ రోజు రిలీజ్ చేసిన ‘నువ్వు అయిపోతావురా లంగా ‘ సాంగ్ ..ఓ క్రేజీ సాంగ్. స్టోరీ చాలా డిఫరెంట్.. ఓ కొత్త ఎక్సపీరియన్స్‌ను మాత్రం ఇస్తుంది“ అన్నారు. హీరో సాయి రొనాక్ మాట్లాడుతూ “మొదట్లో చదివేటప్పుడు ఓ ర‌క‌మైన ప్రెజ‌ర్ ఉంటుంది. ఇప్పుడు ఓ ర‌క‌మైన ప్రెజ‌ర్ ఉంటుంది. అలాంటి ప్రెజ‌ర్స్ గురించే ఈ మూవీలో చూపించాం. అయితే యూస్ వెళ్ళడం అనే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కించాం. చాలా మంచి సబ్జెక్ట్ ఎంటర్‌టైనింగ్‌గా సెటైరికల్ గా చెప్పాం“ అన్నారు.

సాయి రొనాక్, ప్రీతి అస్త్రాని, తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామ కృష్ణ, రాజై రోవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి లిరిక్స్: సిరా శ్రీ, రాహుల్ సిప్లిగంజ్, ఆర్ట్: జె కె మూర్తి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగుంజ్, సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్, అనిత్ మదాడి, ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న, నిర్మాతలు: సుజై, A. అప్పిరెడ్డి, సుశీల్, రచన- దర్శకత్వం : సుజై, సుశీల్.

- Advertisement -