రాష్ట్రపతి ఎన్నికల్లో 99.18 శాతం ఓటింగ్‌..

55
president
- Advertisement -

దేశాధ్యక్షున్ని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు చీఫ్‌ రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమతించిన 736 మంది ఓటర్లలో (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఈ రాత్రి కల్లా ఢిల్లీలోని పార్లమెంట్‌కు తరలిస్తామని వెల్లడించారు. మరోవైపు బీజేపీ ఎంపీ సన్నీడియోల్‌తో సహా ఆరుగురు ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. దేశ వ్యాప్తంగా ఎన్నికైన సుమారు 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. జూలై 21న పార్లమెంట్ హాల్‌లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. గెలిచిన అభ్యర్థి జూలై 25న తదుపరి 15వ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

- Advertisement -