- Advertisement -
దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగగా కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగుమమైంది. 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీలో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో శాసన సభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది.
Also Read:Harishrao: పార్టీ ఫిరాయించిన వ్యక్తికి చీఫ్ విప్ పదవా?
- Advertisement -