- Advertisement -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు అమోద ముద్రవేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రభుత్వ ఏర్పాటుకు ఇవాళ రాత్రి 8.30 గంటల వరకు సమయం ఇచ్చారు గవర్నర్. అయితే సమయం ముగియకుండానే గవర్నర్ సిఫారసు,కేంద్ర కేబినెట్ అమోదం తెలపడంతో రాష్ట్రపతి పాలనకు అమోదముద్రవేశారు రామ్ నాథ్. దీంతో 20 రోజుల హైడ్రామాకు తెరపడింది.
ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. కానీ బీజేపీకి 105 స్థానాలు మాత్రమే వచ్చాయి. శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 56 సీట్లు గెలుచుకున్నాయి. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ముందుకురాకపోవడంతో శివసేన తర్వాత ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు. కానీ అంతలోనే రాష్ట్రపతి పాలనకు అమోదముద్రవేశారు రామ్‌నాథ్ కోవింద్.
- Advertisement -