సెన్సార్ పూర్తి చేసుకున్న’గీత గోవిందం’..

258

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఛలో భామ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ట్రైలర్‌ మరియు సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి సిద్దమౌతున్నారు చిత్ర బృందం.

Geetha Govindam' Censor

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. “రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాము. అల్లు అరవింద్ ఆశీస్సులతో .. బన్నీ వాసు సహకారంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేశాము. విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన సినిమా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఈ సినిమాను రూపొందించాము. గోపీసుందర్ అందించిన సంగీతానికి లభించిన ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Geetha Govindam