శబరిమలకు ముర్ము…తొలి రాష్ట్రపతి!

7
- Advertisement -

కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేరళ పర్యటనలో భాగంగా ఆమె అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించనుండగా రాష్ట్రపతి హోదాలో స్వామి వారిని దర్శించుకున్న తొలి వ్యక్తిగా నిలవనున్నారు ముర్ము.

నిలక్కల్ హెలిప్యాడ్‌లో దిగిన తర్వాత, ఆమె పాంబ బేస్ క్యాంప్‌కు వెళ్తారు. అక్కడి నుంచే భక్తులు ఆలయానికి పైకెళ్లే యాత్ర ప్రారంభిస్తారు. అయితే ముర్ము 4.25 కిలోమీటర్ల నడక మార్గాన్ని అనుసరిస్తుందా లేదా ప్రత్యేక వాహనంలో వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది.

శబరిమల ఆలయం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇ ప్రతి సంవత్సరం మండల-మకర విలక్కు యాత్రా కాలంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మే 18 మరియు 19 తేదీలలో భక్తుల ప్రవేశంపై తాత్కాలికంగా ఆంక్షలు విధించబడ్డాయి. వర్చువల్ క్యూ టిక్కెట్లను కూడా రద్దు చేశారు.

Also Read:Joe Biden: జో బైడెన్‌కు క్యాన్సర్​

- Advertisement -