- Advertisement -
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. దేశంలో గత ప్రభుత్వాల కంటే వేగంగా దేశంలో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుండి కుంభమేళాకు భక్తులు తరలివస్తున్నారని ఇది మన సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనం అన్నారు.
భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపిన ముర్ము.. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 26న మరణించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళులర్పించారు.
Also Read:కాంగ్రెస్ పాలనలో బిల్డర్లు ఆత్మహత్య: హరీశ్
- Advertisement -