ఇవాళ హైదరబాద్‌లో పర్యటించనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలకు హాజరుకానున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయగా మధ్యాహ్నం వరకు మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు మచ్చింతల్ చేరుకుంటారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు జీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.