ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది ఈసీ. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవి కాలం వచ్చే నెల 24వ తేదీన ముగియనుంది. ఆ లోపే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ.
పార్లమెంటు ఉభయ సభలు అంటే లోక్ సభ, రాజ్యసభ. ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఢిల్లీతో పాటు పుదుచ్చేరి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. బీజేపీకి పోటీగా ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఇక ప్రతిపక్షాలు సైతం ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉన్నాయి.

