- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏపీ పర్యటనలో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముర్ము..ఇవాళ ఉదయం వరాహస్వామి ఆలయాననికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి.. శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలతో రాష్ట్రపతిని సత్కరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -