రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6.20 నుంచి 7.10 వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు ముర్ము.
రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమిషనర్ పి.విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి సూచించారు. నగరంలో ట్రాఫిక్ సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 85004 11111 అందుబాటులో ఉంటుందని చెప్పారు.
Also Read:KTR: గ్యారెంటీల పేరుతో ఆస్తుల జప్తా!