మెలానియాతో చిందులేసిన ట్రంప్

182
President Donald Trump First Dance
- Advertisement -

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరిగింది. లక్షల సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ట్రంప్ ఉల్లాసంగా గడిపారు. అగ్రరాజ్యం సంప్రదాయం ప్రకారం నిర్వహించిన వేడుకల్లో సతీమణితో కలిసి ట్రంప్ కాలు కదిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక డోనాల్డ్ ట్రంప్ ఆడిపాడారు.

మిలిటరీ అధికారులతో కలిసి కేక్ కట్ చేసిన ట్రంప్ సభికులను ఉత్సాహపరిచారు. ట్రంప్‌, మెలానియాలతో పాటు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఆయన సతీమణి కరేనా కూడా డ్యాన్స్‌ చేశారు. యూఎస్‌ నేవీకి చెందిన అధికారిణి కాథరీన్‌ కార్ట్‌మెల్‌తో ట్రంప్‌, యూఎస్‌ ఆర్మీకి చెందిన అధికారి జోస్‌ ఏ మెడీనా అనే అధికారితో మెలానియా నృత్యం చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన నేతలంతా కలిసి వేదికపై డ్యాన్స్ చేయటంతో అహుతులంతా కేరింతలు, చప్పట్లు కోట్టి ఎంజాయ్ చేశారు. 70 పదల వయసులో ట్రంప్ సతీమణితో కలిసి డ్యాన్స్ చేయటం విశేషం. సైనికుల త్యాగాలు, వారి సేవల గౌరవార్థం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాయుధ దళాలలకు మెలానియా ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. వారికి ప్రథమ మహిళగా ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.

https://youtu.be/PvsmtspdquA

- Advertisement -