తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం..’ప్రేమించొద్దు’

11
- Advertisement -

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు..అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ‘నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు.. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్‌ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు. చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -