ప్రేమలో త్రిష.. పెళ్లికి రెడీ

70
- Advertisement -

సీనియర్ హీరోయిన్ త్రిష వయస్సు ఇప్పుడు 39 ఏళ్లు. సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎప్పుడో అడుగు పెట్టింది. ఐతే, ఆల్ మోస్ట్ ఫేడ్ అవుట్ దశలో కొట్టుమిట్టాడుతూ.. మళ్ళీ ఈ మధ్య త్రిష ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. మరోపక్క తన తోటి హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్ లాంటి కొందరు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. అందుకే త్వరలోనే తాను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది త్రిష. అందుకోసం వరుడ్ని కూడా తానే వెతుక్కుంది. తమిళనాడుకు చెందిన ఓ హోటల్ అధినేతతో త్రిష ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో త్రిషతో అతగాడు కలిసి కనిపించడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఐతే, దీనిపై త్రిష ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో త్రిష మరోసారి అతనితో ఓ వెకేషన్ కి కూడా వెళ్లి వచ్చిందట. ఈ వార్తలు నిజమే అని తేలడంతో త్రిష ప్రేమ వ్యవహారానికి బలం చేకూరింది. దీంతో హీరోయిన్ త్రిష డేటింగ్‌లో ఉన్నారని రుజువు అయ్యింది. దీనికితోడు, త్రిష కొత్త ప్రేమ పుకారు పై ఆమె సన్నిహితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవును త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది, ఇప్పటికే త్రిష పెళ్లి చాలా లేట్ అయింది అంటూ కోలీవుడ్ మీడియాతో త్రిష స్నేహితులు కామెంట్స్ చేశారు.

అలాగే, వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ‘ఇప్పటికే త్రిషకి మేం కాల్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పాము. త్రిష వివాహం చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. త్రిషకి అంతా మంచే జరగాలని మేం కోరుకుంటున్నాను. పెళ్లి అనేది నూరేళ్ల బంధం. త్రిష తన భర్తతో చిలకాగోరింకల్లా కలకాలం కలిసి ఉండాలని ఆశిస్తున్నాం’ అంటూ త్రిష సన్నిహితులు కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి…

Balagam:అంతర్జాతీయ వేదికపై మన బలగం సినిమా..!

SalmanKhan:సల్మాన్‌ సినిమాలో బతుకమ్మ పాట..!

మెరిసిపోతుంది.. మరి ఛాన్సులేవీ?

- Advertisement -