నేటి రోజుల్లో రోడ్ యాక్సిడెంట్లు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. రోడ్డు ప్రమాదాల గురించి ప్రతిరోజూ ఎన్నో వార్తలు చూస్తుంటాం చదువుతుంటాం. వీటి కారణంగా అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతూ కన్నవాళ్లకు అయినవాళ్ళకు కడుపు కోత మిగిలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఎన్ని రూల్స్ షరతులు పెట్టిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకపోతే రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కష్టమే అంటున్నారు నిపుణులు. కాబట్టి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వ్యక్తిగత జాగ్రత్తలు ఎంతో ముఖ్యం అవేంటో తెలుసుకుందాం !
అతివేగం
రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం ద్వారానే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బైకు లేదా కారు వంటి వాహనాలను పరిమితికి మించి వేగంగా నడపడం వల్ల వాహనం కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది. తద్వారా సదరు డ్రైవర్ ఆందోళనకు గురైనప్పుడు రోడ్డు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వాహనానికి నిర్దేశించిన సురక్షితమైన వేగం ( గ్రీన్ లైన్ ) లోనే ప్రయాణం చేయడం శ్రేయస్కరం.
డ్రైవింగ్ రాకపోవడం
నేటి రోజుల్లో చాలామంది సరైన డ్రైవింగ్ స్కిల్స్ లేకుండానే వాహనాన్ని నడపడం చేస్తున్నారు. తద్వారా వారు ప్రమాదానికి గురి కావడంతో పాటు ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. వాహనాన్ని అదుపు చేయడం, స్పీడ్ కంట్రోల్, ట్రాఫిక్ రూల్స్.. ఇలా అన్నిటిపై పూర్తి అవగాహన ఉండి లైసెన్స్ జారీ చేసిన తరువాతే వాహనాన్ని నడపడం ప్రారంభించాలి.
హెల్మెట్ ధరించకపోవడం
బైకు యాక్సిడెంట్లలో చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి బైకు పై వెళ్ళే వారు కచ్చితంగా హెల్మెంట్ ధరించడం ఎంతో మేలు.
సీటు బెల్ట్ పెట్టుకోవడం
కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోకూడదు. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితినుంచి తప్పించుకోవడానికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం జరిగే కారు ప్రమాదాల్లో చాలా వరకు సీటు బెల్ట్ పై నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోపోతున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించడం
రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే టర్నింగ్ పాయింట్లలో హటాత్తుగా అవతలి వాహనాలు వస్తుంటాయి. కాబట్టి ఆ టైమ్ లో ఇండిగేషన్ లైట్స్ వేయడం, స్పీడ్ బ్రేక్స్ వద్ద నెమ్మదిగా ప్రయాణించడం.. ఇలా కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ
ఇలా కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.
Also Read:‘గర్భాసనం’ యొక్క లాభాలు..!