కాసర్లకు ‘ప్రవాసీ ఎక్సలెన్స్‌’ అవార్డు

77
Pravasi Excellence award - 2016

కోఅలీషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసీ మిత్ర సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘ప్రవాసీ ఎక్సలెన్స్’ అవార్డుకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇతర దేశాల్లో స్థిరపడి వివిధ రంగాల్లో తమ పోటీతత్వం,నైపుణ్యం,సామర్థ్యంతో పాటు మానవతా దృక్పథంతో సేవలందించిన ప్రవాస భారతీయులకు కుల మత మరియు ప్రాంతీయ భేదం లేకుండా ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

కరీంనగర్ జిల్లా చెందిన నాగేందర్ రెడ్డి కాసర్ల…. గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నారైలకు చేరవేయటంలో ముందున్నారు. దీంతో పాటు మెల్ బోర్న్ నగరంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసీస్‌లో తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల గొప్పతనాన్నిఎన్నారైలకు చేరవేస్తున్న కాసర్లను ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు కోట వ్యవస్థాపక అధ్యక్షులు మంద బీంరెడ్డి తెలిపారు.

Pravasi Excellence award - 2016

ఈ పురస్కారాన్ని ఈ నెల 18న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించబోయే ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే సందర్బంగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ రావ్ చీటీతో పాటు కమిటీ సభ్యులు కోట బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

Pravasi Excellence award - 2016