- Advertisement -
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని …దీంతో ప్రత్యేక రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందని వివరించింది. అయినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని పార్లమెంట్‌లో కేంద్రం వివరించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్పెషల్ ప్యాకేజీ కింద రూ. 15.81కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందని తెలిపింది. 2015-2018 వరకూ EAP పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని చెల్లించామని పేర్కొంది. దీంతో ప్రత్యేక హోదా అనే ఆంశం లేదని వివరించారు.
ఇవి కూడా చదవండి…
పానీపూరీ తిన్న జపాన్ ప్రధాని..
ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…
- Advertisement -