Nara Rohith:10న ‘ప్రతినిధి 2’

31
- Advertisement -

హీరో నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ ‘ప్రతినిధి 2’ వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు కలసిరాబోతున్నాయి.

ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేసారు, ఈ పాటలో రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు కనిపించారు. రెండవ పాట- జర్నలిస్ట్ గీతం, కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం ఇవ్వగా స్వరాగ్ కీర్తన్, జయంత్ పాడిన పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

ప్రతినిధి 2 ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

Also Read:TTD:శ్రీ‌వారి భ‌క్తుల‌కు విస్తృత ఏర్పాట్లు

- Advertisement -