మొక్కలు నాటిన ప్రతిక్ష యాదవ్..

86
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్బంగా వైజాగ్ లోని కంబల్ కొండ ఇకో పార్క్ లో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు TRS రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ కూతురు ప్రతిక్ష యాదవ్.

ఈ సందర్భంగా శ్రీ ప్రతిక్ష మాట్లాడుతూ పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు.ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా మొక్కలు నాటాలని కోరారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ మొక్కలు నాటే స్టేజ్ నుండి అడవులను దత్తత తీసుకునే వరకు ఎదిగిందని ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు.

green india challenge

నాలుగేళ్లు గా నిరంతరం మొక్కలు నాటుతూ, నాటిస్తూ రేపటి తరాలకు మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కోసం జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషి చాలా గొప్పది అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఈ అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కుటుంబ సభ్యులు మరియు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -