తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రతాని

10
- Advertisement -

తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా

తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లు ఈ పదవీ కాలం. ఈ రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారు. నిర్మాతలే వెయ్యి మంది ఉన్నారు. ఇప్పటిదాకా మా అసోసియేషన్ నుంచి 200కు పైచిలుకు సినిమాలు సెన్సార్ అయ్యాయి. ఈ ఏడాది 70 సినిమాలు సెన్సార్ చేశాం. సినిమా ఔట్ డోర్ షూటింగ్ ల సమయంలో యూనిట్ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, చిన్న చిత్రాలకు రాయితీలు వంటివి ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నాతో పాటు వివిధ పోస్టులకు ఎన్నికైన నా మిత్రులకు శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.

ఉపాధ్యక్షుడు డి. కోటేశ్వరరావు మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ కు ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన సభ్యులకు, తన పూర్తి సహకారం మాకు అందిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. వచ్చే రెండేళ్లలో మంచి కార్యక్రమాలు మా సభ్యుల కోసం చేపట్టబోతున్నాం. మాకు పర్మినెంట్ ఆఫీస్, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనున్నాం. అలాగే సీరియల్స్, సినిమాల్లో తెలంగాణ నటీనటులకు, టెక్నిషియన్స్ కు అ‌కాశాలు వచ్చేలా మా వంతు ప్రయత్నం చేస్తాం అన్నారు.

Also Read:మళ్లీ ఉగ్రరూపం దాల్సిన గోదావరి..

- Advertisement -