1009 కోట్లు.. ప్రశాంత్‌ వర్మ బిల్డపులొద్దు

31
- Advertisement -

‘హను-మాన్‌’ చిత్రం సంచలం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక దీని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తలరాతనే ఈ చిత్రం మార్చేసింది. ‘హను-మాన్‌’ తర్వాత తనకి రూ.100, 200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయన్నారు. ఓ ఎన్నారై ఐతే ఏకంగా మన ఇతిహాసాలతో సినిమా తీస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి రెడీ అయినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. మొత్తానికి ప్రశాంత్‌ వర్మకు రూ.1000 కోట్ల ఆఫర్‌ అనే సరికి ఇండస్ట్రీలో కొందరు బాగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.

వచ్చిన హిట్ ను క్యాష్ చేసుకోవాలని ప్రశాంత్ వర్మ అనవసరంగా లేనిపోని బిల్డప్ లు ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, రూ.1000 కోట్ల ఆఫర్‌ ఇస్తాను అని చెప్పిన వ్యక్తి గురించి మాత్రం ప్రశాంత్ వర్మ మళ్లీ మరో మాట మాట్లాడలేదు. అయినా, ఒక సినిమా పై వేయి కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. మరోపక్క ప్రశాంత్ వర్మ మాత్రం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హడావుడి చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమా సీక్వెల్ జై హ‌నుమాన్ థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఆ సినిమా కూడా హిట్ అయితే ప్రశాంత్ వర్మ కు అదృష్టం కలిసి వచ్చినట్టే. అయితే, ఇక నుంచి ప్ర‌తీ సంక్రాంతికి ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి సినిమాలొస్తాయ‌ని వెల్ల‌డించాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ప్ర‌శాంత్ వ‌ర్మ చేసిన ఆ స్టేట్‌మెంట్ కూడా హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇక‌పై ప్ర‌తీ సంక్రాంతికి పోటీగా సినిమా రిలీజ్ చేయాలని ప్ర‌శాంత్ వ‌ర్మ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

Also Read:Nirmala:అవినీతిని గణనీయంగా తగ్గించాం

- Advertisement -