హరీశ్‌పై విమర్శలు సిగ్గుచేటు: ప్రశాంత్ రెడ్డి

0
- Advertisement -

హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపణలు సరికాదన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. హరీష్ రావు దుబాయ్ కి మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలోని ఒక కార్యక్రమానికి వెళ్ళాడు… SLBC ప్రమాదం హరీష్ రావు దుబాయ్ వెళ్ళాక జరిగిందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం .. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హరీష్ రావు అన్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సెల్బీసీలో ప్రమాదం జరిగిన తర్వాత అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చి సందర్శనకు వచ్చింది అన్నారు. అధికారంలో ఉన్న మంత్రి, ఎస్సెల్బీసీ తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చి ప్రమాదం జరిగిన చోట ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నాడు అన్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ మంత్రులు వినోద ప్రాంగణంగా మార్చుకున్నారు.. బాధిత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా హరీష్ రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ బృందం ఎస్సెల్బీసీ సందర్శనకు వెళితే కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుని ఆంక్షలు విధించిందన్నారు. బీజేపీ బృందం సందర్శనకు వెళితే సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతించింది .. సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఎస్సెల్బీసీ సందర్శనకు వెళ్లిన సీఎం రేవంత్.. హరీష్ రావు మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

Also Read:చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు..సీఎంకు హరీశ్‌ సవాల్

ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా బాధితులకు భరోసా లేదు.. ఆడలేక మద్దెలోడు అని హరీష్ రావు మీద విమర్శలు చేయడం రేవంత్ అవివేకానికి నిదర్శనం అన్నారు.

- Advertisement -