నల్లూరు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి..

254
minister prashant reddy
- Advertisement -

ఈ రోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్మశాన వాటిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి.

అలాగే అనంతరం పద్మశాలి భవనం నిర్మాణానికి రూ.5 లక్షలు, లైబ్రరీ భవనం నిర్మాణానికి మరో 5 లక్షలు రూపాయలు అందించి భవనాల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. తర్వత ఎస్.సి కమ్యూనిటీ హాల్ రూ.7.50 లక్షలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హజరైయ్యారు.

- Advertisement -