నేను స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థినే: తమిలిసై

518
governor tamilisai
- Advertisement -

తాను స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్ధినే అన్నారు గవర్నర్ తమిలిసై సౌందర్ రాజన్‌. హైదరాబాద్ దోమలగూడ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ ని సందర్శించిన మాజీ ఎంపీ కవితతో కలిసి సందర్శించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

ఈ సందర్భంగా మాట్లాడిన తమిలిసై స్కౌట్స్ అండ్ గైడ్‌కి తన మద్దతు ఎప్పటికి ఉంటుందని తెలిపారు. ఏవిధంగా సహాయం చేయాలి…ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు.

స్కౌట్స్ అండ్ గైడ్ డ్రెస్ కవిత పంపించారు…తాను పిల్లల తో కలిసిపోవలని ఈ డ్రెస్ వేసుకున్నానని చెప్పారు. సమాజం పట్ల, తల్లిదండ్రులు,టీచర్ ఎప్పటికి మర్యాదగా ఉండాలన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న కవిత…ఈ సందర్బముగా గౌరవ వందనం స్వీకరించారు.

- Advertisement -