సభ పరువును తీశారు: ప్రశాంత్ రెడ్డి

1
- Advertisement -

శాసన సభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. .ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదు అన్నారు. సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారు .. .తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయిందన్నారు.

కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభ ను వాయిదా వేస్తారా ?, కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారు అన్నారు.. మళ్ళీ మార్పులు ఎందుకు చేశారు ..ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీ ఆర్ ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? అని ప్రశ్నించారు గంగుల కమలాకర్. బీసీ గణన పై చర్చ అని వాయిదా వేస్తారా ?, కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారు ?..బీసీ లను కాంగ్రెస్ మోసం చేస్తోంది ..మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా
…మా జీవితం లో ఈ తరహా లో అసెంబ్లీ ని చూడాలేదు అన్నారు.

Also Read:వేసవిలో చర్మసమస్యలా.. అయితే!

- Advertisement -