దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు..

114
- Advertisement -

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే బరిలో మిగలడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దామోదర్ రావు, పార్థ సారథి రెడ్డిలకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు,రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి,దుర్గా ప్రసాద్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు(గాయత్రి) రవిచంద్ర,టిఆర్ఎస్ఎల్పి కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -