ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైపోయింది. సోనియాగాంధీతో ఆమె నివాసంలో మరోసారి భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, జయరాం రమేష్, అంబికా సోని, కేవి వేణుగోపాల్ ఉన్నారు.దాదాపు ఆరు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన వీరి చర్చల్లో కీలక ప్రతిపాదనలను వారి ముందుంచారు ప్రశాంత్ కిషోర్.
కాంగ్రెస్ పార్టీలో తాను చేరితే తన పని విధానం ఎలా ఉంటుంది, బూత్ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అధికార పార్టీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలను ఇప్పటికే వివరించారు. 72గంటల్లో తుది నివేదికను సోనియాకు సమర్పించనున్నారు కాంగ్రెస్ నేతలు.
అయితే ప్రశాంత్ ప్రతిపాదనలను కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్‌లో గాంధీ కుటుంబానికి ప్రశాంత్ నుండి కొత్త తలనొప్పి ఎదురుకావొచ్చని తెలుస్తోంది. ఏదిఏమైనా మెజార్టీ అభిప్రాయం ప్రకారం సోనియా నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది పార్టీ శ్రేణులన సందిగ్దంలో పడేసింది.