బెంగాల్ ఉప ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్. ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని జోస్యం చెప్పారు. బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం అసాధ్యమని… ఒకవేళ వారికి డబుల్ డిజిట్ వస్తే.. ఇకపై రాజకీయాలకు స్వస్థిపలుకుతా అని మరోసారి స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కులాన్ని ఉపయోగించుకుని బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని మండిపడ్డారు కిశోర్. కులం ఎప్పుడూ ఉనికిలో లేదని చెప్పలేం. కానీ, ఇక్కడ కాస్తా భిన్నంగా ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎస్సీల తర్వాత అతిపెద్ద సమాజంగా నమశూద్రులు, మాటువాస్ ఉన్నారు. వీరు గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సామూహికంగా ఓటు వేశారు. అయితే, ఆ తర్వాత బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో నమశూద్ర ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వారు ఓడిపోయారని చెప్పారు. ఎస్సీలు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయరన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె చీఫ్ ఎంకే స్టాలిన్ కోసం పనిచేస్తున్నారు ప్రశాంత్ కిశోర్.