గెలుపు నాదే..ప్రశాంత్ ధీమా!

1
- Advertisement -

బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. పోలింగ్‌కు ముందు తమ పార్టీకి చెందిన 16 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ కార్యకర్తలను వేధించడానికే పోలీసులను ఉపయోగిస్తున్నాయని ఆయన ఆరోపిస్తూనే తమ విజయంపై 200 శాతం ధీమా వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్….జన్‌ సూరాజ్ నాయకులను నిర్బంధించారని, వారి సమాచారం కుటుంబ సభ్యులకు లేదా పార్టీకి తెలియజేయకుండా ఒకచోటి నుంచి మరోచోటికి తరలించారని ఆరోపించారు. మేము చెప్పినట్లుగానే నిన్న సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు పోలీసులు 16 మందికి పైగా జన్‌ సూరాజ్ నాయకులను వేధించారు. పేపర్‌పై అధికారికంగా అరెస్టు చూపించకుండా, వారిని అరెస్టు చేసినట్లుగా వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు అని కిషోర్ అన్నారు.

అదుపులోకి తీసుకున్న నాయకులను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఆ స్టేషన్ల నుండి తరలించిన తర్వాత వారిని ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికీ తెలియలేదు. రాత్రి రెండు గంటల పాటు వెతికిన తర్వాత, వారందరినీ దానాపూర్‌కు తరలించినట్లు తెలిసింది. ఆ విషయంతో పాటు అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని తెలియగానే, వారిని మళ్లీ షాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు అని వివరించారు.

తమ పార్టీ కార్యకర్తలు ఏదైనా నేరానికి పాల్పడితే పోలీసులు వారిపై కేసులు నమోదు చేయాలని కిషోర్ అన్నారు. కానీ వారు ఏ తప్పూ చేయకపోతే ఎన్నికల సమయంలో జన్‌ సూరాజ్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనకుండా నిరోధించడానికి మాత్రమే పోలీసులు అధికార బీజేపీ మరియు ప్రభుత్వానికి సహాయపడే రాజకీయ విభాగంలా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. నిర్బంధించిన వారిలో ఎక్కువమంది పాట్నా నివాసులేనని, అయితే వారు ఏ నేరం చేశారనేది పోలీసులు వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. “వారు బయటి వ్యక్తులు అని కొందరు వాదిస్తున్నారు కానీ నిర్బంధించిన వారిలో కనీసం పదిమంది పాట్నా స్థానికులే. రాత్రి వేళల్లో ఇళ్లపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు….చివరికి అనారోగ్యంతో ఉన్న నితీష్ కుమార్ నకిలీ వీడియోను కూడా విడుదల చేశారు కానీ అదీ విఫలమైంది అని కిషోర్ అన్నారు.

Also Read:చైనా తీరుపై ట్రంప్ అసంతృప్తి!

- Advertisement -