- Advertisement -
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని లేదంటే 10 కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు.
బీహార్ పవర్‌ప్లే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన పీకే.. ప్రజలు జన్ సురాజ్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తే 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అన్నారు. అదే తిరస్కరిస్తే మాత్రం 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావొచ్చు అని సంచలన కామెంట్ చేశారు.
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జన్ సురాజ్ పార్టీ ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read:టీ తాగేవారికి డేంజర్ బెల్స్!
- Advertisement -

