CM Jagan:జగన్ కు ఐప్యాక్ షాక్?

15
- Advertisement -

ఏపీలో వచ్చే ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలని సి‌ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈసారి గెలిస్తే మరో ముప్పై ఏళ్ల వరకు తమదే అధికారం అని పదే పదే పార్టీ నేతలకు చెబుతూ దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇక ఈసారి కేవలం విజయం మాత్రమే కాకుండా 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యూహాలు అమలు చేస్తున్నారు పార్టీ నేతలు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా అందరిని కూడా ఆయా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంచుతున్నారు. ఆయితే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెలుతున్న నేతలకు ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదు.

దీంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందా అనే దానిపై అభిప్రాయాలను సేకరించే పనిలో ఉంది వైసీపీకి సంబంచించిన ప్రముఖ సర్వే సంస్థ ఐప్యాక్. ఆయితే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని రిపోర్ట్ లో తేలిందట. దీంతో ఆ ఎమ్మెల్యేల విషయంలో కొంత అసహనంగా ఉన్నట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన జగన్.. 42 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని, తీరు మార్చుకోవాలని గతంలోనే హెచ్చరించారు.

Also Read:ఈ తెలుగు బ్యూటీ వాటికీ రెడీ!

ఇప్పుడు ఐప్యాక్ రిపోర్ట్ లో మరికొంతమంది ఎమ్మేల్యేలు వచ్చి చేరడంతో.. వారిని మార్చలా లేదా అనే దానిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారట. ప్రజా వ్యతిరేకత ఉన్నవారికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదని గతంలోనే తేల్చి చెప్పారు జగన్.. ఇప్పుడు దాదాపు 50 మందిపై వ్యతిరేకత ఉన్నట్లు ఐ ప్యాక్ తెలపడంతో వారి స్థానంలో కొత్త అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్నట్లు టాక్. ఆయితే పాతవారిని పక్కన పెట్టి కొత్తవారికి సీట్ల కేటాయింపు జరిపితే.. సీటు దక్కనివారి నుంచి తిరుగుబాటు మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార వైసీపీని రోజుకో కొత్త అంశం కలవర పెడుతోంది. మరి అధినేత జగన్ ఎలాంటి వ్యూహాలఃతో ముందుకు సాగుతారో చూడాలి.

Also Read:పిక్ టాక్ : హన్సికా అందాల దాడి

- Advertisement -