తాను కవితతో కలిసి పని చేయబోతున్నానన్న వార్తలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తిగా ఖండించారు. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందని తాను వ్యాఖ్యానించినట్లు, అలాగే రెండు సార్లు కవితను కలిసి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయంలో జరుగుతున్న లీకులు, ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ అబద్ధాలేనని ప్రశాంత్ కిషోర్ కొట్టి పారేశారు.
తాను ఎవరితో కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేసే అంశంపై ఎలాంటి చర్చలు జరపలేదని, కవితతో రాజకీయ భాగస్వామ్యం గురించి మాట్లాడిన సందర్భమే లేదని తెలిపారు. రాజకీయంగా తనపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సరికాదని, వాస్తవాలను వక్రీకరించొద్దని మీడియాకు సూచించారు. ప్రస్తుతం తాను ఎలాంటి రాజకీయ పార్టీ ఏర్పాటుపై దృష్టి పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Also Read:ఏ తప్పు చేయలేదు..భయపడేది లేదు!

