‘హనుమాన్-2’ దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

14
- Advertisement -

సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే, ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి, రాముడి రోల్‌ కు సూపర్ స్టార్ మహేష్ బాబు సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అలాగే ప్రశాంత్ వర్మ హను మాన్’ సినిమా సక్సెస్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరి ఆ కామెంట్స్ ఏమిటో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాటల్లోనే విందాం…‘ఈ సినిమా ఒక స్థాయిని దాటేసాక, ఇదంతా హనుమంతుడే చేయిస్తున్నాడనే నమ్మకం కలిగింది. సినిమా రిలీజ్ అయిన తరువాత సింగీతం శ్రీనివాసరావు గారు కాల్ చేసి, సక్సెస్‌ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారనేది నాకు ఆ తరువాత అర్థమవుతూ వస్తోంది’ అని అన్నారు. మొత్తానికి ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తుంది.

ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఫీట్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ జరిగిన తరువాత కేవలం తెలుగు రాష్ట్రాల థియేటర్ల నుంచే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నాలుగవ సినిమాగా నిలిచినట్లు సమాచారం. ఇప్పటివరకు బాహుబలి, బాహుబలి 2, RRR మాత్రమే ఆ లిస్టులో ఉండేవి.

Also Read:అదృష్టమంటే ఈ కుమారి దే..

- Advertisement -