ప్రసాద్..నిర్మాతల మండలి అధ్యక్షుడు

38
- Advertisement -

తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో జెమినీ కిరణ్‌పై 24ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించనున్నారు. అయితే గతంలో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. తెలుగు నిర్మాతల మండలిలో మొత్తం 1134ఓట్లు కాగా పోలైన ఓట్లు 677 ఇందులో మొత్తం దామోదర్ ప్రసాద్‌కు 339ఓట్లు పోలవగా..జెమినీ కిరణ్‌కు 322ఓట్లు వచ్చాయి. నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్నకుమార్‌ వైవీఎస్ చౌదరి జాయింట్‌ సెక్రటరీలుగా భరత్‌చౌదరి నట్టికుమార్‌ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా దిల్‌రాజు, డీవీవీ దానయ్య, పీవీ రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, పద్మిని, వేణుగోపాల్‌ రెడ్డి, సురేందర్‌రెడ్డి, గోపీనాథ్ ఆచంట, ఠాగూర్‌ మధు, కేశవరావు పల్లి, శ్రీనివాసరావు వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్ ప్రతాని, పూసల కిశోర్‌ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2025వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి…

తారకరత్న చేసిన ఆ తప్పే.. కొంప ముంచిందా!

పొలిటికల్ ఎంట్రీపై సోనూ..

ఇంటికి వచ్చేస్తున్న సంక్రాంతి సినిమాలు

- Advertisement -