ప్రారంభోత్సవం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

28
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఈ నెల 24న ప్రారంభం కావాల్సింది. ఐతే, ‘ఎన్టీఆర్‌ 30’ చిత్రం పూజా కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాని వచ్చే నెల మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంబిచాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడు అని టాక్. పైగా ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. అందుకే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించబోతుంది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కలిసి నటిస్తే.. ఆ స్క్రీన్ విజువల్స్ అదిరిపోతాయి. పైగా జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్.. సో.. ఈ ఇద్దరికి తోడు కొరటాల డైరెక్షన్.. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా, ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు

ఇవి కూడా చదవండి…

ఓబుగా వచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవాడేమో

పెళ్ళై, తల్లి అయినా ఫుల్ డిమాండే

తారకరత్న మరణం.. చంద్రబాబు హైడ్రామా!

- Advertisement -