ఆ హీరోయిన్ కు ఇదొక సైడ్ బిజినెస్ …

457
Pranitha turns her passion into a business
- Advertisement -

తన అందచందాలతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న హీరోయిన్‌ ప్ర‌ణీత.అత్తారింటికి దారేది చిత్రంతో త‌న అందాల‌ను ఆర‌బోసిన ఈ చిన్న‌ది దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉంది.

అందుకే సినిమాల ద్వారా తాము సంపాదిస్తున మొత్తాన్ని రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అందుకే సెలబ్రిటీలు ఏం చేసినా అది అందర్నీ ఆకట్టుకుంటుంది. వాళ్లకున్న క్రేజ్ అలాంటిది.

త‌న మాతృ ప‌రిశ్ర‌మ అయిన క‌న్న‌డ‌లో సినిమాల్లో న‌టిస్తునే వ్యాపారంలోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. అందుకేహోట‌ల్ కం బార్ వ్యాపారాన్ని చూసుకుటోంది.

Pranitha turns her passion into a business

దీనిని చెయిన్ బిజినెస్ విధానంలో దేశ‌మంతా విస్త‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది ఈ భామ‌. ప‌లు న‌గ‌రాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసేందుకు ప్రయ‌త్నాలు జ‌రుపుతోంది. ఈ సంద‌ర్భంగా మీరు నిర్మాతగా మారుతారా? అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌ణీత స‌మాధానం చెబుతూ… ఇప్ప‌టికిప్పుడు త‌న వ‌ద్ద నిర్మాత అయ్యేంత డ‌బ్బు లేదని చెప్పింది. ‘ఇప్పుడే వ్యాపారం మొద‌లైంది క‌దా, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో?’ అంటూ నవ్వేసింది అందాల సుంద‌రి.

ఇప్పటికే తమన్నా చేస్తున్న ‘వైట్ అండ్ గోల్డ్’ నగల వ్యాపారానికి బోలెడంత‌ డిమాండ్ ఉంది. చెల్లెలు షగున్‌తో కలిసి తాప్సీ చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా న‌డుస్తోంది. వీరితో పాటు. కాజల్, నిషా అగర్వాల్ చేస్తున్న ‘మార్ సాలా’ నగల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల చందంగా ఉందట. దీంతో వీరి బాట‌లోనే ప్ర‌ణీత కూడా చేరింది.

- Advertisement -