- Advertisement -
టాలీవుడ్ బ్యూటీ ప్రణీత శుభాష్ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టిందని ఆమె తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. గత కొన్నిరోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందని ప్రణీత మాతృత్వపు సంతోషాన్ని పంచుకుంది. ఈ మేరకు ఆ పసిపాపను చేతుల్లో పట్టుకొని ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ప్రణీతకు గతేడాది బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి జరిగింది.
- Advertisement -