ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..

109
minister ktr
- Advertisement -

రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకెళ్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ రోజు జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్నారు. ఉద్యమ నినాదానికి అనుగుణంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టామని తెలిపారు. 95 శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో తెలంగాణలో 19 వేల పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి.

రాష్ట్రం సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా దూసుకెళ్తున్నాయన్నారు. ఓ వైపు పర్యావరణం, మరో వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో వచ్చిన నిధులను రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశాన్ని నడుపుతున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.నీళ్ల విషయంలో దేశంలో 75 ఏండ్లలో జరగని పురోగతిని రాష్ట్రంలో సాధించామన్నారు. రూ.45 వేల కోట్లు ఖర్చుచేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. మండు వేసవిలో కూడా కాలువల్లో నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం తెలంగాణలో ఉందన్నారు. లార్జెస్ట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని గూగుల్‌ కొడితే కాళేశ్వరం అని వస్తుందని చెప్పారు. నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశామని వెల్లడించారు. 1964లో ఎస్‌ఆర్‌ఎస్పీకి అప్పటి ప్రధాని నెహ్రూ కొబ్బరికాయ కొడితే మొన్నటిదాకా కాల్వలు తవ్వారని విమర్శించారు.

కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా 82 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు ఎత్తిపోస్తున్నామని మంత్రి అన్నారు. 90 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరమని ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.జగిత్యాల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ధాత్రి, భువి కంపెనీలు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి ఆహ్వానిస్తున్నామన్నారు.

- Advertisement -