పెళ్లి పీట‌లెక్కిన హీరోయిన్‌ ప్రణీత..

61
Heroine Pranitha

టాలీవుడ్ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ పెండ్లి పీట‌లెక్కింది. మే 30 2021న వ్యాపార‌వేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది ప్ర‌ణీత‌. బెంగ‌ళూరులో జ‌రిగిన వెడ్డింగ్ సెర్మ‌నీకి కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, అత్యంత స‌న్నిహితులు మాత్రమే హాజ‌ర‌యిన‌ట్టు ప్ర‌ణీత స‌న్నిహిత వర్గాలు వెల్ల‌డించాయి. లాక్ డౌన్ కాలంలో ఇలా స‌డెన్ గా పెండ్లి పీట‌లెక్కి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది ప్ర‌ణీత‌.

పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపించే హీరోయిన్లు మనకు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు ప్రణీత. కన్నడ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినా… అచ్చ తెలుగు అమ్మాయిలా ఆమె తెలుగు సినీ అభిమానుల మనసులను దోచుకుంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఆమె… మన ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా అలరించింది. ఒక నటిగానే కాకుండా ప్రణీత… ఒక మనసున్న మనిషిగా ఎంతో సామాజిక సేవ చేశారు. కరోనా ఫస్ట్ వేస్ నుంచి ఆమె అభాగ్యుల కోసం తన వంతు సాయం చేశారు. స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తూ, ఎందరో నిరుపేదల ఆకలిని ఆమె తీర్చారు. ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.