రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’

229
- Advertisement -

సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పలువురు మంత్రులు,వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. శీతకాల విడిది కోసం రాష్ట్రపతి వారం రోజుల క్రితం నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆహ్లాదరకర వాతావరణంలో రాష్ట్రపతి అతిథులందర్నీ పలకరించారు.

Pranab Mukherjee 'At Home' Reception At Rashtrapati Bhavan

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే. బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేయగా…శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్‌ 31న వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

- Advertisement -