తెలంగాణ జాగృతి క్రికెట్ కప్-2017

267
- Advertisement -

జనవరి 7నుంచి 23వ తేదీ వరకూ తెలంగాణ జాగృతి క్రికెట్ కప్-2017ను నిర్వహించనుంది. గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందిండంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ జాగృతి నిర్వహించే క్రికెట్ కప్ తోడ్పాటుకానుంది. క్రికెట్ క‌ప్‌ను నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు.

క్రికెట్ మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరగనున్నాయి. పాత పది జిల్లాలను పది జోన్లుగా విభజించారు. ప్రతి జోన్ నుంచి గరిష్టంగా 24 టీంలు చొప్పున మొత్తం 240 టీంలు పోటీల్లో పాల్గొననున్నాయి. కొన్ని జిల్లాలు భౌగోళికంగా దూరంగా ఉండటంతో క్రీడాకారుల సౌకర్యం కోసం ప్రతి జోన్‌లో రెండు కేంద్రాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి జోన్ లో విన్నర్‌ టీం రాష్ట్ర స్థాయిలో ఆడుతుంది. జనవరి 17 నుంచి 22 వరకు హైద‌రాబాద్‌లో జ‌రిగే మ్యాచ్‌లలో 10 టీంలు తలపడనున్నాయి. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి  జనవరి 23న హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Telangana Jagruthi Cricket Cup- 2017

జోన్ స్థాయిలో విన్నర్ టీంకు 30 వేల రూపాయలను, రన్నర్ టీంకు 15 వేల రూపాయలు ప్రైజ్ మనీ కింద తెలంగాణ జాగృతి అందజేయనుంది. ఇక గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో విన్‌ అయిన టీంకు ప్రైజ్ మ‌నీగా రూ.3 లక్షలు, రన్నర్ టీంకు రూ. 1.50 లక్షలును తెలంగాణ జాగృతి అందజేస్తుంది.

అసక్తి కలిగిన యూత్ తమ టీంను జ‌న‌వ‌రి 2వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు తెలంగాణ జాగృతి జిల్లా ఆఫీసుల్లో ఎంట్రీ చేయించుకోవచ్చు. జోన్‌కు గ‌రిష్టంగా 24 టీంలు మాత్రం అనుమ‌తించ‌బ‌డును. ముందు వ‌చ్చిన వారికి రిజిస్ట్రేష‌న్‌లో ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డుతుంది. తెలంగాణ జాగృతి యువ‌జ‌న విభాగం బాధ్యులు టీం రిజిస్ట్రేషన్, మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌ చూడనున్నారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యం లేదా ఫోన్ నెంబర్ 040-40213214 నెంబ‌ర్‌లో సంప్రదించవచ్చు.

- Advertisement -