బర్త్ డే…మొక్కలు నాటిన ప్రకాశ్ రాజ్

58
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్క నాటారు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఈరోజు తన పుట్టినరోజు పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కను నాటారు.


ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు, పెళ్లిరోజున మొక్కలు నాటుతు పర్యావరణానికి మేలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు..ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటెలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ని అభినందించారు.గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రకాష్ రాజ్ కోరారు.

- Advertisement -