ఆయనకు భాస్కర్‌ అవార్డు కూడా రాదు!

18
- Advertisement -

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఇన్ కేరళ కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్‌…కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

అర్థంపర్థం లేని సినిమాల్లో కశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. ఇది సిగ్గులేనితనం అన్నారు. తనకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారు. ఆస్కార్ కాదు కదా.. ఆయనకు భాస్కర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇదో ప్రాపగాండా ఫిల్మ్….ప్రజల్ని ఎల్లప్పుడూ మోసపుచ్చలేరన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -